దేశంలో కరోనా రికవరీ రేటు 83.33 శాతం

30 Sep, 2020 11:51 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో 80,472 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,179 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62,25,763గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,40,441గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 51,87,826కి చేరింది. (చిన్నసైజు తుంపర్లతోనూ కరోనా)

కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 97,497కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 86,428 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో 10,86,688 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 7 కోట్ల 41లక్షలుగా ఉంది. (ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా) 

మరిన్ని వార్తలు