Coronavirus: యాక్టివ్‌ కేసులు 33,49,644

2 May, 2021 10:02 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశంలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 3689 మంది ప్రాణాలు విడిచారు. 3,07,865 మంది ఈ వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,59,92,271గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,57,457 కరోనా కేసులు నమోదవగా ఇందులో 33,49,644 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం 15,68,16,031 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 2,15,542 మంది కరోనాకు బలయ్యారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7430 కరోనా కేసులు నమోదవగా 56 మంది మరణించారు.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఇప్పటివరకు 3,67,727 మంది డిశ్చార్జ్ అవగా 2368 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 80,695 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీలో 1546, మేడ్చల్‌లో 533, రంగారెడ్డిలో 475, నల్లగొండలో 368, సంగారెడ్డిలో 349 కరోనా కేసులు నమోదవగా వరంగల్‌ అర్బన్‌లో 321, నిజామాబాద్‌లో 301 కేసులు వెలుగుచూశాయి.

చదవండి: బాబోయ్‌... 4 లక్షలూ దాటేశాం

మరిన్ని వార్తలు