వైరస్‌ విస్ఫోటనం.. అక్కడే కేసులు ఎందుకు అధికం?!

5 Apr, 2021 16:03 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పదిరోజుల నుంచి కరోనా రెండో ఉధృతి మిన్నంటుతోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,553 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. మరోవైపు కరోనా నుంచి 2,060 మంది కోలుకున్నారు. 15 మంది కరోనాతో అసువులు బాశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 10,15,155, డిశ్చార్జ్‌లు 9,63,419, మరణాలు 12,625 కి పెరిగాయి. ప్రస్తుతం 39,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో 331 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  

ఐటీ సిటీలో 2,787 
రాష్ట్రంలో కరోనా కేసుల్లో సగం పాజి­టివ్‌లు సిలికాన్‌ సిటీలోనే ఉంటున్నాయి. బెంగళూరులో తా­జా­గా 2,787 పాజిటివ్‌లు, 1,225 డిశ్చార్జిలు, 8 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,031కు పెరిగింది. అందులో 4,14,283 మంది కోలుకోగా, 4,649 మరణాలు సంభవించాయి. నగరంలో ప్రస్తుతం 28,098 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

బెంగళూరులో ఎందుకు అధికం ?  
బెంగళూరు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దుమ్ము, ధూళి కారణాలుగా చెబుతున్నారు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి నగరంలో వాహనాల సంచారం తక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం గతంలో మాదిరిగా విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. దీనికి తోడు నగరంలో ఎక్కడ చూసినా రోడ్డు పనులు జరుగుతుండడంతో దుమ్ము రేగుతోంది. ఆ మార్గాల్లో సంచరించే ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా అలాంటి వారికి కరోనా సులువుగా సోకుతున్నట్లు భావిస్తున్నారు. దీనికి తోడు యువత రద్దీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనే వాదనలూ ఉన్నాయి.

1.19 లక్షల టెస్టులు  

  • రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 1,19,881 మందికి పరీక్షలు చేశారు. మొత్తం టెస్టులు 2,18,89,602 కి చేరాయి. బెంగళూరులో బీబీఎంపీ వైద్యసిబ్బంది మెజెస్టిక్‌ బస్టాండు సహా రద్దీ ప్రాంతాల్లో పరీక్షల్ని ముమ్మరం చేసింది.  
  • రాష్ట్రవ్యాప్తంగా 15,106 మందికి కరోనా టీకా వేశారు. దీంతో మొత్తం టీకాల పంపిణీ 43,55,893 కి పెరిగింది. 
    చదవండి: భారత్‌లో కరోనా: లక్ష దాటిన రోజువారీ కేసులు
     
మరిన్ని వార్తలు