IND: ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కలకలం.. పిల్లల్లో కొత్త లక్షణాలు!

8 Apr, 2023 08:48 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ టెన్షన్‌ పెడుతోంది. దేశవ్యాప్తంగా మళ్లీ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6వేలు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 

ఇదిలా ఉండగా.. దేశంలో కోవిడ్‌ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీని ఫలితంగానే దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక, ఈ వేరియంట్‌పై పరిశోధనలు కూడా చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది.

మరోవైపు.. ఈ వేరియంట్‌ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతో​ంది. ఈ వేరియంట్‌ సోకిన పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా కోవిడ్‌ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. గతంలో కరోనా బారిపడినవారిలో ఇలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ఈ కొత్త లక్షణాలతో పాటుగానే గతంలో మాదిరిగానే కోవిడ్‌ బాధితులకు హైఫీవర్‌, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు