Ram Mandir: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం

4 Jan, 2024 07:07 IST|Sakshi

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్‌ధామ్‌తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన
 

>
మరిన్ని వార్తలు