రాజధానిని కలవరపెడుతోన్న కరోనా కేసులు

1 Sep, 2020 21:13 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,312 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత రెండు నెలల వ్యవధిలో ఈ రోజు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం ఢిల్లీలో కేసుల సంఖ్య 1.77 లక్షలకు పైగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు వైరస్‌ బారిన పడి 18 మంది మరణించారు. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా బారిన పడి 4,462 మంది మరణించారు. రికవరీ రేటు 88.5శాతంగా ఉంది. ఢిల్లీలో ఇప్పటవరకు అత్యధికంగా జూలై 4న 2, 505 కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఇలా చేస్తే 2 లక్షల మరణాలు నివారించవచ్చు..)

ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది. కరోనా రోగుల్లో కొత్తగా 65,081 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996.  దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.77 శాతంగా ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా... 62 లక్షల కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో.. 39 లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు