పాక్‌లో పైశాచిక ఘటన.. భారత్‌ స్పందన ఇది

29 Dec, 2022 20:46 IST|Sakshi

ఢిల్లీ: పాకిస్థాన్‌లో జరిగిన పైశాచిక ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. పాక్‌లో మైనారిటీల(హిందూ, ఇతర ముస్లిమేతర మతాల) పరిరక్షణతో పాటు వాళ్ల భద్రత బాధ్యత కూడా అక్కడి ప్రభుత్వానిదేనని కుండబద్ధలు కొట్టింది. 

తాజాగా.. సింజోరో పట్టణంలో బుధవారం ఓ హిందూ మహిళను ఘోరంగా హత్య చేశారు. 40 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి మరీ హత్య చేశారు. ఆపై వర్ణించడానికి వీల్లేని రీతిలో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. ఈ విషయాన్ని అక్కడి హిందూ సెనేటర్‌ కృష్ణ కుమారి ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. 

ఈ ఘోర హత్యాచారోదంతంపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీకి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.  పాక్‌ గడ్డపై ఉన్న మైనారిటీల పరిరక్షణ అక్కడి ప్రభుత్వానిదే. వాళ్ల బాగోగులు కూడా చూసుకోవాలి. గతంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాం. ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నాం అని ఆయన తెలిపారు. అయితే.. ప్రత్యేకించి ఆ కేసు ఇంకా ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు