ఒకే రోజు 57 వేల కేసులు

2 Aug, 2020 02:36 IST|Sakshi

24 గంటల్లో 764 మరణాలు

17 లక్షలకు చేరువగా మొత్తం కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఏకంగా 57,118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,95,998 కి చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 10,94,374కు చేరుకుంది. కోవిడ్‌ మొత్తం మరణాల సంఖ్య 36,511కు చేరుకోగా, గత 24 గంటల్లో 764 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,65,103 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 2.15కు పడిపోగా, రికవరీ రేటు 64.53కు పెరిగింది.

మరణాల రేటు తక్కువ..
లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రస్తుతం దేశంలో అత్యంత తక్కువ మరణాల రేటు ఉందని కేంద్రారోగ్య శాఖ తెలిపింది. జూన్‌ మధ్యలో 3.33గా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.15కు తగ్గిందని చెప్పింది.

వెంటిలేటర్ల ఎగుమతి..
మరణాల రేటు తగ్గిన నేపథ్యంలో స్వదేశంలో తయారైన వెంటిలేటర్లను ఎగుమతి చేసే నిర్ణయానికి మంత్రుల ఉన్నత స్థాయి గ్రూప్‌ అంగీకరించింది. ఈ వెంటిలేటర్ల వల్ల ప్రపంచంలో కొత్త మార్కెట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో వెంటిలేటర్లను ఇరవైకిపైగా సంస్థలు తయారుచేస్తున్నాయి.

మరిన్ని వార్తలు