దేశంలో కొత్తగా 45,083 కరోనా కేసులు

29 Aug, 2021 10:28 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా వల్ల 460 మంది మృతి చెందగా.. మొత్తంగా 4,37,830 మంది బాధితులు మరణించారు.శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 35,840 మంది కరోనా నుంచి బయటపడ్డారని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.53 శాతంగా ఉందని తెలిపింది.

చదవండి: Covaxin Vaccine: కోవాగ్జిన్‌ సింగిల్‌ డోస్‌?!: ఐసీఎంఆర్

మరిన్ని వార్తలు