31 లక్షలు దాటిన రికవరీలు

6 Sep, 2020 04:52 IST|Sakshi

40 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విశ్వరూపం సాగుతోంది. కేవలం 13 రోజుల్లో కేసుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు చేరుకుంది. శనివారం రికార్డు స్థాయిలో 86,432 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరుకుంది. మూడు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,072  మంది కోలుకోగా..1,089 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 69,561కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 31,07,223కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,46,395గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 21.04 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.23 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.73 శాతానికి పడిపోయిం దని తెలిపింది. సెప్టెంబర్‌ 4 వరకు 4,77,38,491 శాంపిళ్లను  పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం  మరో 10,59,346 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. తాజా 1,089 మరణాల్లో అత్యధికంగా మహా రాష్ట్ర నుంచి 378 మం ది మరణించారు.

మరిన్ని వార్తలు