కరోనా ప్రకోపం ఇంకెన్నాళ్లు?

1 May, 2021 03:42 IST|Sakshi
ఘాజీపూర్‌లో కోవిడ్‌ బాధితుల మృతదేహాలను దహనం చేస్తున్న దృశ్యం

రికార్డు స్థాయిలో 3,86,452 కొత్త కేసులు నమోదు

24 గంటల్లో 3,498 కరోనా మరణాలు

21.2 శాతానికి చేరుకున్న సంక్రమణ రేటు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ వేగం రోజు రోజుకి పెరుగుతోంది. గత 9 రోజులుగా ప్రతీరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయంటే కరోనా ఏ విధంగా విలయతాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 24 గంటల్లో 3,86,452 కరోనా వైరస్‌ కేసులు నమోదు కాగా, 3,498 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో సంక్రమణ రేటు 21.2 శాతానికి అంటేప్రతీ 100 మందిలో 21 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తిస్తున్నారు.

శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో పాజిటివ్‌ కేసులు మహారాష్టలో అత్యధికంగా ఒక్క రోజులోనే 66,159 కేసులు రాగా కేరళలో 38,607, ఉత్తరప్రదేశ్‌లో 35,104 వచ్చాయి. వీటన్నింటితో కలిపి ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,87,62,976కు పెరిగింది. అదే సమయంలో దేశంలో మరణాల సంఖ్య 2,08,330కు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 31,70,228 యాక్టివ్‌ కేసులు ఉండగా, 24 గంటల్లో 2,97,540 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 15.22 కోట్లను దాటింది.  


మరిన్ని వార్తలు