కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు మృతి

5 May, 2021 13:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మనుషుల జీవితాలను కరోనా వైరస్‌ రెండో దశ అతలాకుతలం చేస్తోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులు, సాధారణ ప్రజలు కోవిడ్‌ కోరల్లో చిక్కుకొని మృత్యువాతపడుతున్నారు. తాజాగా కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు(62) మృతిచెందారు. డీఆర్‌డీవో ఫెసిలిటీలో చికిత్స పొందుతూ నారాయణరాజు మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నారాయణరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా. ఇటీవలే రాజుకు న్యాయశాఖ కార్యదర్శిగా ఒక సంవత్సరం పొడిగింపు ఇచ్చారు.

చదవండి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌: ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ 

మరిన్ని వార్తలు