కేంద్రం శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌‌పై సబ్సిడీ స్కీమ్ పొడిగింపు

7 Mar, 2024 21:18 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు మాత్రమే కాకుండా ఎల్‌పీజీ సబ్సిడీ పథకాన్ని కూడా ఏడాది పాటు పొడిగించింది. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్‌పీజీ సబ్సిడీని సిలిండర్‌పై రూ.300కి పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తిస్తుంది. 

రానున్న మూడేళ్లలో అదనపు ఎల్‌పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనికి రూ.1650 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

జనపనారకు కూడా కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపింది. జనపనార మద్దతు ధర ఇప్పుడు ఉన్నదానికంటే కూడా 285 రూపాయలు పెంచింది. దీంతో క్వింటాల్ జనపనార ధర రూ. 5,335కు చేరింది.

Election 2024

మరిన్ని వార్తలు