సంపూర్ణ లాక్‌డౌన్‌.. రేపటి నుంచి 1 వరకు

21 Apr, 2021 22:55 IST|Sakshi

ముంబై: దేశంలోనే అత్యధిక స్థాయిలో కరోనా వైరస్‌ మహారాష్ట్రలో విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 22 రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కట్టడికి ఇక విధిలేక లాక్‌డౌన్‌ వైపు మహారాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. కరోనా కట్టడి చర్యలకు సహకరించాలని ప్రజలను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

గత వారమే లాక్‌డౌన్‌ విషయమై అన్ని పార్టీల నాయకులతో సమావేశమై చర్చించారు. అప్పుడు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్నీ చర్యలు తీసుకున్నా కరోనా వైరస్‌ అదుపులోకి రాకపోవడంతో చివరకు గత్యంతరం లేక లాక్‌డౌన్‌ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నుంచి మే 1వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజుకు అర లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 62,097 కేసులు వెలుగులోకి వచ్చాయి.

చదవండి:
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కుటుంబంలో విషాదం

సూపర్‌ ఐడియా.. పిట్టగూడే మాస్క్‌..!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు