పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు

30 Oct, 2023 16:04 IST|Sakshi

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్‌స్పెక్టర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. 

"పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్‌గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు  కాల్పులు జరిపారు.

ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్‌లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు

మరిన్ని వార్తలు