లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను: నిర్మలా సీతారామన్

28 Mar, 2024 06:54 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సర్వత్రా సిద్దమవుతున్న వేళ బీజేపీ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తిరస్కరించారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేయాలని అధిష్టానం కోరింది. దీనిపై ఆలోచించిన సీతారామన్ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

అధిష్టానం ఇచ్చిన ఆఫర్ గురించి 10 రోజులు ఆలోచించినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే బోలెడంత డబ్బు కావలి. అంతే కాకుండా.. కుల పరమైన, మతపరమైన సమీకరణలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ అలోచించి పోటీ చేయడానికి నిరాకరించినట్లు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయడానికి మీ దగ్గర డబ్బు లేదా అనే ప్రశ్నకు, నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ.. కేవలం నా జీతం, నా సంపాదన, నా సేవింగ్స్ (పొదుపు) మాత్రమే నావి అని పేర్కొంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనకు చెందదని సీతారామన్ స్పష్టం చేశారు.

బీజేపీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా వంటి ఎంతో మంది రాజకీయ ఉద్దండులను బీజేపీ రంగంలోకి దింపింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ.. అభ్యర్థుల కోసం ప్రచారానికి పరిమితం అవుతానని, మీడియా ఈవెంట్‌లకు హాజరవుతానని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers