Omicron Variant In Maharashtra: టీకా సర్టిఫికేట్‌, క్వారంటైన్‌ తప్పనిసరి

27 Nov, 2021 19:19 IST|Sakshi

కొత్త ఆంక్షలు విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

ముంబై: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త వేరియంట్‌ కట్టడి కోసం రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్‌ విధించింది. అవేంటంటే..
(చదవండి: Omicron: న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం)

1. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలి.
2. రాష్ట్రానికి వచ్చే దేశీయ ప్రయాణికులు తప్పనసరిగా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలి. లేదా.. 72 ముందు చేసిన పీసీఆర్‌ టెస్ట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలి. 
3. బస్సు, టాక్సీ, ఇతర వాహనాల్లో కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘించినట్లు తెలిస్తే.. డ్రైవర్‌, కండక్టర్‌ 500 రూపాయల జరిమానా చెల్లించాలి.
4. బస్సుల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకుంటే.. ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. 
5. ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే బంధువులు, నిర్వహకులు, సిబ్బంది తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకోవాలి. 
6. టీకా రెండు డోసులు తీసుకున్న వారికే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం లభిస్తుంది.
7. సినిమాల హాళ్లు, ఫంక్షన్‌ హాల్స్‌ వంటి వాటిలోకి 50 శాతం మందికి మాత్రమే అనుమతి.
8. దక్షిణాఫ్రికా నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చే వారు తప్పనిసరిగా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందే.

తెలంగాణలో...
ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌ రావు ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ కానున్నారు. 

చదవండి:
ఒకే చోట 281 కేసులు.. లాక్‌డౌన్‌ విధిస్తారా?!

డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌.. అయినా 66 మందికి సోకిన కరోనా!

మరిన్ని వార్తలు