‘ఇంటి నుంచి పని’లో పదనిసలు

24 Aug, 2020 14:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సందర్భంగా అమల్లోకి వచ్చిన ‘ఇంటి నుంచి పని చేయడం’ అనే కొత్త విధానం ఇప్పటికీ అమలవుతోన్న విషయం తెల్సిందే. ఈ విధానం సత్ఫలితాలిస్తోందా? అన్న అంశంపై ఇప్పటి వరకు వెలువడిన పలు సర్వేలు పరస్పర భిన్న అభిప్రాయాలను వెల్లడించాయి. ఇప్పుడు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ విద్యావేత్తలు నిర్వహించిన అతిపెద్ద సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. (94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’)

‘ఇంటి నుంచి పని చేయడం’ విధానంలో యాజమాన్యాలు నిర్దేశించిన నియమ నిబంధనలను లేదా మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది, అంటే 63 శాతం మంది ఉల్లంఘించారు. ఇంటి నుంచి పని విధానంలో బాసులు, సిబ్బంది మధ్య పరస్పర అసంతృప్తులు వ్యక్తం అయ్యాయి. బాసులు అనవసరంగా తమపై ఒత్తిళ్లు పెంచారని, టార్గెట్లు పెంచారని, ఎంత పని చేసినా బాసులు ప్రశంసించేవారు కాదని, కొన్ని కంపెనీల్లోనయితే 20 శాతం జీతాల్లో కోత విధించారని ఆరోపించారు. ఇంటర్నెట్‌ సరిగ్గా పని చేయడం లేదని, పని చేసినా స్పీడ్‌ సరిగ్గా లేదంటూ ఉద్యోగులు పని తప్పించుకు తిరుగుతున్నారని కొన్నికంపెనీల యాజమాన్య వర్గాలు ఆరోపించాయి.

‘ఇంటి నుంచి పని చేయడం’లో జూలై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకునే ఉద్యోగులు బాగా పని చేస్తునట్లు సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి టార్గెట్లను నిర్ధేశించిక పోయినా వారు చిత్తశుద్ధితో పని చేయడం ప్రశంసనీయం. (కోమాలోకి కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. సోదరికి అధ్యక్ష బాధ్యతలు!)

ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల్లో మూడింట ఒక వంత మంది మాత్రమే సంతృప్తికరంగా పని చేస్తున్నట్లు తేలింది. ఇంటి నుంచి పని చేయడంలో ఆడవారికన్నా మగవారే మెరుగ్గా పని చేస్తున్నట్లు సర్వేలో వెల్లడయింది. ఆడవారిపైన ఇంటి పని భారం పడడమే అందుకు కారణం. ఇంటి నుంచి పని చేయడంలో మీడియా సంస్థలు ముందున్నాయి. 44 శాతం మంది మీడియా సిబ్బంది మెరుగ్గా పని చేశారు.

>
మరిన్ని వార్తలు