Ayodhya Ram Mandir: నేడు అయోధ్యలో ఏ సమయానికి ఏం జరగనుంది?

22 Jan, 2024 08:12 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్‌లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే..

దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం.

అయోధ్యలో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు. 

యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ‍ప్రదర్శనలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు.

రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన.

సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి.

రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో.

రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం.

తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం

రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడం.

కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం.

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం. 
 

నూతన రామాలయంలో నేటి మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. అంటే 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ నేపధ్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు. 


 

>
మరిన్ని వార్తలు