5 వ్యాక్సిన్లు : 100 కోట్ల డోసులు 

23 Oct, 2020 11:01 IST|Sakshi

అయిదు వ్యాక్సీన్లు  100 కోట్ల డోసుల తయారీకి సన్నాహకాలు

సాక్షి, ముంబై: కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు కరోనా వైరస్  ఒక  వాక్సిన్లకు సంబంధించి ఒక్కోదానికి ఒక బిలియన్ మోతాదులను తయారు చేస్తున్నట్టు సీరం సీఈఓ అదార్ పూనావల్లా  తెలిపారు.  అలాగే 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్‌  లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. (కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు)

2021-22 ముగిసేలోపు ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవోవాక్స్, కోవివాక్స్, కోవి-వాక్, ఎస్ఐఐ కోవాక్స్ అనే ఐదు వేర్వేరు కరోనావైరస్ వ్యాక్సిన్లకు సంబంధించి వందకోట్ల మోతాదులను సిద్ధం చేయనున్నామని పూనావల్లా చెప్పారు.  'కోవిషీల్డ్' కరోనావైరస్ వ్యాక్సిన్‌తో ప్రారంభించి, సీరం 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.  20-30 మిలియన్ మోతాదులను  ఇప్పటికే తయారు చేస్తున్నామనీ దీన్ని నెలకు 70-80 మిలియన్లకు పెంచనున్నామని పూనావల్లా తెలిపారు. టీకా షెల్ఫ్ జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పూణేలోని ఎస్‌ఐఐ ప్రక్కనే కొత్త ఉత్పాదక కేంద్రం సిల్స్‌ రాబోతోందని, ఇది పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని అదార్ పూనావాలా తెలిపారు. అప్పటి వరకు సిల్స్ అవుట్ సోర్స్  చేస్తుందన్నారు.  ఈ రెండూ పూర్తయిన తరువాత డిమాండ్, అవసరాన్ని బట్టి  2 నుంచి 3 బిలియన్ మోతాదుల వరుకు తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటామని కూడా పూనావల్లా వెల్లడించారు.

బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంయక్తంగారూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,600 మందిలో క్లినికల్ ట్రయల్ 3వ దశలో ఉంది. దీని తయారీకి సంబంధించి ఇప్పటికే సీరం ఒప్పంద భాగస్వామ్యం చేసుకుంది. రెండవ వ్యాక్సిన్ బయోటెక్ సంస్థ నోవోవాక్స్ కు చెందిన 'కోవోవాక్స్'. దీని  ఫేజ్-1 క్లినికల్ ట్రయల్ మే 2020 లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ 2020 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. నోవోవాక్స్ 2021 లో ఒక బిలియన్ మోతాదులను ఉత్పత్తికి సీరం ఒప్పందం చేసుకున్న సంగతి  తెలిసిందే.

మరిన్ని వార్తలు