క‌రోనాను జ‌యించిన‌ సిద్ధ‌రామ‌య్య

13 Aug, 2020 19:38 IST|Sakshi

బెంగ‌ళూరు: కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ క‌రోనా వైర‌స్‌ను జ‌యించారు. ఆయ‌న త‌న‌యుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే డా.య‌తీంద్ర సిద్ధ‌రామ‌య్య సైతం వైర‌స్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన సిద్ధరామ‌య్య‌కు ఆగ‌స్టు 3న ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో ఆయ‌న బెంగ‌ళూరులోని మ‌నిపాల్‌ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గురువారం ఆయ‌న‌కు రెండు సార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ వ‌చ్చింది. దీంతో సిద్ధ‌రామ‌య్య‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే వైద్యుల స‌ల‌హా మేర‌కు వారం రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండ‌నున్నారు. (రాజుకున్న రాజధాని)

ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప‌ది రోజులుగా వైద్య సేవ‌లందించిన ఆస్ప‌త్రి వైద్యుల‌కు, సిబ్బందికి, తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించిన కార్య‌క‌ర్త‌ల‌‌కు‌ సిద్ధ‌‌రామ‌య్య ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌రోవైపు ఆయ‌న కొడుకు య‌తీంద్ర సిద్ధ‌రామయ్యకు కూడా ఆగ‌స్టు 7న పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. దీంతో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్న ఆయ‌న కూడా క‌రోనాను జ‌యించి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా‌ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డియూరప్ప కూడా సోమ‌వారం క‌రోనా నుంచి బ‌య‌ట‌పడిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. (యడ్డీ, సిద్దూల మధ్య ఏం జరుగుతుంది!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు