Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

29 Apr, 2022 16:50 IST|Sakshi

1.. Guntur Btech Student Murder Case: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు
గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. AP Minister: కేటీఆర్‌ వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా: మంత్రి బొత్స కౌంటర్‌
ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు చెప్పాడేమో కానీ తాను నిన్న‌టి వరకు హైద‌రాబాద్‌లోనే ఉన్నానని తెలిపారు. జనరేటర్‌ వేసుకొని ఉండివచ్చానన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. Who Is Manu Gulati: మనసులు గెల్చుకున్న టీచరమ్మ.. ఆర్డీనరీ మాత్రం కాదండోయ్‌
పాఠాలంటే బోరుగా ఫీలయ్యే ఈరోజుల్లో.. పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పడం ఒక కళగా మారింది. ఆ కళను అవపోసిన టీచరమ్మే ఈ మను గులాటి. అదేనండీ పాఠం అయిపోగానే.. విద్యార్థినితో కలిసి హుషారుగా గంతులేసిందే.. ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.  అయితే ఆమె మామూలు ఇంగ్లిష్‌ టీచర్‌ మాత్రమే కాదండోయ్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. కేసీఆర్‌ క్లారిటీకి వచ్చారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఎజెండాను నిర్దిష్టంగానే పొందించుకుంటున్నప్పటికీ , దానిపై ఇంకా క్లారిటీకి వచ్చారా లేదా అన్న సందేహం కలుగుతుంది. గతంలో దేశంలో కాంగ్రెస్, బిజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దానిపై ఆయన ఆయా రాష్ట్రాలలో పర్యటించి ముఖ్యమంత్రులను కలిసి వచ్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. International Dance Day 2022: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు..
సినిమా పాటలే కాదు.. ఈమధ్య లోకల్‌ బీట్స్‌ కూడా హుషారుగా జనాలతో గంతులేయిస్తున్నాయి. అందుకు సోషల్‌ మీడియా కారణం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  ప్రత్యేకించి స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే(ఏప్రిల్‌ 29). ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో అలా వైరల్‌ అయిన కొన్ని పాటలపై లుక్కేద్దాం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6..సృష్టించిన వాడినే అంతం చేసేందుకు యత్నించిన మైక్రోవేవ్‌
శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలు కనుక్కునే క్రమంలో అనేక రకాలైన ప్రమాదాలను ఎదుర్కొవడం సహజం. ఒక్కోసారి తమ ప్రాణాలనే కోల్పోతారు కూడా. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడొక వ్యక్తికి ఎదురైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7..Acharya Movie Review: ‘ఆచార్య’ మూవీ ఎలా ఉందంటే..
ఆచార్య పోస్టర్లు, టీజర్‌, పాటలు​ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. IPL 2022: కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. ఇద్దరూ అదరగొడుతున్నారు! హ్యాపీగా ఉంది!
టీమిండియా స్పిన్‌ ద్వయం కుల్దీప్‌ యాదవ్‌- యజువేంద్ర చహల్‌ ఐపీఎల్‌-2022లో అదరగొడుతున్నారు. అత్యధిక వికెట్‌ వీరులకు ఇచ్చే పర్పుల్‌ క్యాప్ పోటీపడుతున్నారు.‌ఈ ఎడిషన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న కుల్దీప్‌ ఇద్దరూ ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. బ్రిటన్‌ కంపెనీపై ముఖేష్‌ అంబానీ కన్ను! అదే నిజమైతే!
లండన్‌: కొన్నాళ్ల క్రితం ఆటబొమ్మల రిటైల్‌ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసిన దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరో బ్రిటన్‌ కంపెనీపై కన్నేసింది. ఫార్మసీ చెయిన్‌ ’బూట్స్‌’ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. Health Tips: ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఆరోగ్యం లేకుంటే.. ఈ చిట్కాలు పాటిస్తే
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజువారీ జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నారు చాలామంది. కొంత మంది అయితే మాడిపోతున్న పొట్టను పిజ్జా,  బర్గర్లతోనో, బిస్కెట్లతోనో మాయ చేస్తూ, కూరుకుపోతున్న  ఇలా బిజీ లైఫ్‌లో పడి చాలా మంది తమ ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ చూపించడం కూడా మరచిపోతున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు