పాప‌డాలు తినమన్న మంత్రికి క‌రోనా

9 Aug, 2020 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: పాపడ్‌ తింటే క‌రోనా పోతుంద‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చి విమ‌ర్శ‌ల‌పాలైన‌ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ ఇప్పుడ‌దే వైర‌స్ బారిన ప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా ప్ర‌స్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని కేంద్ర‌ మంత్రి తెలిపారు. మొద‌టి సారి నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ రెండోసారి చేసిన ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చింద‌న్నారు. త‌న‌ను క‌లిసిన వారంద‌రూ వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు. (మరో ఎమ్మెల్యేకు ‍కరోనా పాజిటివ్‌)

కాగా అర్జున్ రామ్ మేఘ్వాల్‌ బిక‌నీర్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఆయ‌న.. ఆత్మనిర్భర్‌ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ కంపెనీ త‌యారు చేసిన పాపడ్‌ తింటే శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి అమాంతం పెరిగి క‌రోనాను పోగొడుతుందంటూ మాట్లాడిన ఓ వీడియో గ‌తంలో విప‌రీతంగా వైర‌ల్ అయింది. ఇదిలా వుండ‌గా మ‌రో కేంద్ర మంత్రి కైలాష్ చౌద‌రి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. (నవనీత్‌ కౌర్‌కు కరోనా పాజిటివ్‌)

చ‌ద‌వండి: ‘ఈ పాపడ్‌తో కరోనా పరార్‌’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు