అరిజోన రాష్ట్రంలో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం

10 Jun, 2022 12:19 IST|Sakshi

అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400  పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా వచ్చారు. ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్‌, పాటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు.

ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ.. ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. వందమందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.   రఘు  గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్  అట స్పోర్ట్స్ ,వంశీ ఏరువారం, ఆర్సీ చెన్నయ్య మద్దూరి ఆర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్  కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారని తెలిపారు. 

ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి  లింగాలమాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి , ఋక్కు మిల, అనుదీప్ యాపల,సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్  గంగవల్లి , విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు. ఈ కార్యక​‍్రమానికి వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి  మహీధర్, కిరణ్మయి జ్యోతుల,  నీరజ వ్యవరించారు.  

చదవండి: డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం

మరిన్ని వార్తలు