మలేషియాలో బతుకమ్మ సంబరాలు

18 Oct, 2021 12:41 IST|Sakshi

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కోవిడ్‌ నేపథ్యంలో వర్చువల్‌గా ఈ వేడుకలు జరిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఏటా  బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. వీరితో ఆపటు ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ కాంతారావు, తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టిలతో పాటు పలువురు తెలంగాణ ప్రముఖులు ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.  

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్‌ మారుతీలతో పాటు ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామకృష్ణ,  తదితరులు పాల్గొన్నారు .
 

మరిన్ని వార్తలు