AP Political Updates Feb 19th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

19 Feb, 2024 20:44 IST|Sakshi

AP Elections Political Latest Updates Telugu..

08:50 PM, Feb 19th, 2024

టీడీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు: ఎంపీ కేశినేని నాని

  • బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు: 
  • గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు
  • టీడీపీలో సీనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు కూడా ఉన్నారు.. మీ ఓటు వృథా చేసుకోవద్దు
  • చంద్రబాబు అంటేనే పచ్చి మోసం
  • పనికిమాలిన కొడుకును సీఎం చేయడమే చంద్రబాబు ఎత్తుగడ
  • పాపం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కూడా మోస పోతున్నాడు
  • టీడీపీ ఎలాగూ గెలవదు.. ఎలక్షన్‌ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు, కొడుకులు వెళ్లిపోతారు
  • టిడిపి ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు,కొడుకులు వెళ్ళిపోతారు

08:30 PM, Feb 19th, 2024

ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్‌ వెంటే ఉంటాం:  తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ స్వామిదాస్‌

  • నేను పక్కా లోకల్ .. ముప్పై ఏళ్లుగా ప్రజల తోనే ఉన్నా
  • ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం
  • రోజుకొక వేషం వేసుకుని నియోజకవర్గంలోకి కొందరు వస్తున్నారు
  • ఇప్పటికే నన్ను,తర్వాత ఇంకొకరు,ఆ తర్వాత మరొకరు ఇలా టీడీపీలో ఎందర్ని ఎందుకోసం మారుస్తున్నారో ప్రజలకు తెలుసు
  • టక్కుటమార విద్యలలో మన ముందుకు ఐదేళ్లకోసారి జాతర కోసమన్నట్లు వస్తూనే ఉన్నారు

07:15 PM, Feb 19th, 2024

చంద్రబాబు, ఎల్లోమీడియా పై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్

  • వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే...చెప్పేవాడు చంద్రబాబు 
  • ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్ లను ఏడు విడతల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు
  • అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు 
  • వైఎస్సార్‌సీపీలో  సీట్ల మార్పులు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తారు.. ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు, మహాటీవీ వంశీ కాదు
  • నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్‌ రాధాకృష్ణ టికెట్‌ ఇవ్వగలడు
  • నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి 
  • గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్‌మోహన్‌రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్‌, మహాన్యూస్‌పకోడీగాళ్లు కాదు
  • ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని  నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా
  • గన్నవరంలో వంశీని,గుడివాడలో నన్ను మారుస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారా
  • మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు 
  • పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్‌సీపీలో ఉండదు
  • వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు 
  • మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు 
  • వైఎస్సార్‌సీపీలో  ఒకడు ట్రైచేస్తేనో...బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు 
  • సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు
  • చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి  
  • సీట్లు మారుస్తాడా లేదా..అనేది మాకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం 
  • మధ్యలో తెలుగుదేశం బ్రోకర్లకు పనేంటి
  • ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి 
  • జగన్ మోహన్ రెడ్డిని ఎదుక్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి 
  • ఎందరు కలిసొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించలేరు
  • జగన్ సింగిల్ గా వస్తానని చెబుతున్నాడు ...మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు 
  • చంద్రబాబు పర్మినెంట్ గా మాజీగానే ఉంటాడు  
  • ఈ రాష్ట్రానికి పర్మినెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి 
  • ఏబీఎన్ ను , వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం..ఎవరు రమ్మన్నారు 
  • రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా
  • మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు

06:53 PM, Feb 19th, 2024

నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్‌

  • జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన  ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
  • యువతలో సీఎం జగన్‌కు మంచి క్రేజ్‌ ఉందని, వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా

05:17 PM, Feb 19th, 2024

14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు?: సజ్జల

  • గత ఐదేళ్లలో  ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు
  • చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి
  • చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు 
  • మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం
  • సీఎం జగన్‌కు సవాల్‌ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు
  • చంద్రబాబు సవాల్‌కి మేము సిద్ధమే
  • మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు
  • అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి
  • జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి
  • కౌంట్ డౌన్ మొదలైంది
  • ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు
  • మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్‌గా చెప్పాలి
  • సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు 
  • ఏ సభలోనూ జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు
  • కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు
  • ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు 
  • ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు
  • చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా? 
  • 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు
  • ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు
  • జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు? 
  • రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు?
  • జగన్ ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం
  • చేతిలో పచ్చమీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు 
  • చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు
  • ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని జగన్కి చుడుతున్నాడు 
  • జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చారు
  • ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి
  • కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి 
  • త్వరలోనే మ్యానిఫెస్టోని ప్రకటిస్తాం.. చేయగలిగినదే చెప్తాం

05:15 PM, Feb 19th, 2024

చంద్రబాబు సవాల్‌పై కొట్టు సత్యనారాయణ ధ్వజం

  • చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించింది 
  • చంద్రబాబు అభివృద్ధి మీద చర్చిద్దాం అనడం హాస్యాస్పదం
  • ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు 
  • సీఎం జగన్‌తో సవాల్‌ చేసే స్థాయి చంద్రబాబుకి లేదు
  • మర్రిచెట్టుకి వచ్చినట్లు ఏళ్ళు వస్తే సరిపోదు బుద్ధి జ్ఞానం ఉండాలి 
  • నా పరిపాలన చూసి ఓటెయ్యమని అడిగే దమ్ము దైర్యం చంద్రబాబుకి ఉంటే చెప్పాలి

04:40 PM, Feb 19th, 2024

చంద్రబాబు సవాల్‌కు జగన్‌కు రావాల్సిన అవసరం లేదు.. మేమే సరిపోతాం: పోతుల సునీత

  • చంద్రబాబు సవాల్‌కు సీఎం జగన్‌ రావాల్సిన అవసరం లేదు.. మేమే చంద్రబాబుకు సమాధానం ఇస్తాం
  • రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారు. 
  • రెండు బటన్‌లు నొక్కేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారు..
  • చంద్రబాబు అంటే భయపడాల్సిన అవసరం జగన్‌కు లేదు
  • చంద్రబాబు తన హయాంలోనే సారాను ఏరులై పారించారు
  • ఇసుక అక్రమ రవాణా చేసి కోట్ల గడించారు
  • సిద్ధం సభలు భారీ సక్సెస్‌ అవుతున్నాయి
  • విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు చేశారు
  • అంబేద్కర్‌ స్ఫూర్తితో జగన్‌ పరిపాలన సాగిస్తున్నారు
  • అందుకే సిద్ధం సభలకు భారీగా జనం తరలివస్తున్నారు

04:20 PM, Feb 19th, 2024

చంద్రబాబుతో చర్చకు జగన్ అవసరం లేదు : కేశినేని నాని

  • వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధం
  • తాత్కాలిక సచివాలయం కటడం అభివృద్ధా?
  • ఏపీలో 10 వేలకు పైగా గ్రామ సచివాలయాలు అభివృద్ధి కాదా?
  • సంపదను చంద్రబాబు దోచుకున్నారా? 
     

04:15 PM, Feb 19th, 2024

మమ్మల్ని విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు : ధర్మాన కృష్ణదాస్

  • లోకేష్ అవివేకి, ఆయన మాటలకు విలువలేదు
  • రెడ్ బుక్ చూపిస్తే ఎవరూ భయపడరు
  • దమ్ముంటే లోకేష్‌ నాపై  పోటీ చేయాలి

04:10 PM, Feb 19th, 2024

బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదు: వెల్లంపల్లి

  • బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు
  • బుద్ధా వెంకన్న విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయి
  • బోండా ఉమా, బుద్ధా వెంకన్నను పిచ్చాస్పత్రికి పంపాలి
     

02:45 PM, Feb 19th, 2024

కాకినాడ

రాజకీయ స్వార్థం తో నాపై విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ద్వారంపూడి

  • మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను
  • జాతి అంటే  కొండ బాబు కుటుంబం అని ఆ రోజే  చెప్పాను
  • మత్స్యకారులుకి ఎమ్మెల్సీ ఇప్పించడం లో  నేను కృషి చేశాను
  • కొండ బాబు మత్స్యకారులుకి ఏమి చేశాడు?
  • మత్స్యకార జాతి లో నేను పుట్టకపోవచ్చు..వారి కోసం నేను తప్పిస్తాను

02:40 PM, Feb 19th, 2024

చంద్రబాబు సవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పేర్నినాని 

  • చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడు 
  • బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు
  • బందరు పోర్టును పూర్తిచేశావా చంద్రబాబు 
  • మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్...మూడు గజాలైనా ఇచ్చావా?
  • ఆక్వా హబ్ ను చేస్తానన్నావ్ చేశావా?
  • హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానన్నాడు చేశాడా 
  • గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ ఉంటుంది
  • చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే 
  • ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు 
  • ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట 
  • 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి
  • జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు 
  • 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా?
  • జగన్‌మోహన్‌రెడ్డికి సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు

02:20 PM, Feb 19th, 2024

టీడీపీ కుట్ర బట్టబయలు

  • సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్టుల ద్వారా వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నం
  • షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్‌లు
  • వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్‌ అకౌంట్‌ సృష్టి
  • సోషల్‌ మీడియా ముసుగులో వైఎస్సార్‌సీపీపై విషం జిమ్మిన టీడీపీ
  • టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ్‌ భూషణ్‌ పేస్‌బుక్‌లో షర్మిల, నర్రెడ్డి సునీతపై జుగుప్సాకరంగా పోస్టింగ్‌లు
  • ఫేక్‌ పోస్టులతో కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పెంచేందుకు చంద్రబాబు ఎత్తుగడ
  • ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్‌ను జాకీలెత్తి లేపే ప్రయత్నం

01:42 PM, Feb 19th, 2024
అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం: దేవినేని అవినాష్

  • రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింది
  • తూర్పు నియోజకర్గంలోనే 650 కోట్ల అభివృద్ది జరిగింది
  • కొండ ప్రాంతాలు..కరకట్ట ప్రాంతం ఏంతో అభివృద్ది చేశాం
  • రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచాం 
  • టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదు
  • గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నారు
  • ప్రభుత్వంపై, దేవినేని నెహ్రూపై గద్దె రామ్మెహన్‌ దిగజారి విమర్శలు చేస్తున్నారు  
  • దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి సంక్షేమం పై గద్దె రామ్మోహన్ చర్చకు రావాలి 
  • గద్దె తూర్పులో ఏం అభివృద్ది చేశాడో చెప్పాలి  
  • సెటిల్మెంట్ వారసుడు అని నా పై నోరుపారేసుకోవడం మానుకోవాలి  
  • మేము చేసిన అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం  
  • 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి వణికిపోతున్నారు  
  • జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు
  • హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే  
  • కాల్ మనీ సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్
  • గద్దె భండారం త్వరలోనే బయటపెడతాం
  • సిద్ధం సభలు చూసి టీడీపి శ్రేణులు, దాని మిత్ర పక్షాలుకి మైండ్ బ్లాక్ అయింది
  • నారా లోకేష్ అతనికి ఉన్న ఆస్తుల పై వివరణ ఇవ్వాలి
  • చంద్రబాబు అక్రమ ఆస్తులు పేదలకు పంచాలి

తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యలు

01:09 PM, Feb 19th, 2024
అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: అలీ

  • వైఎస్సార్‌సీపీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా
  • అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా
  • గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధం
  • రాప్తాడు సభ చూశాక వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని అర్థమైపోయింది

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ 

12:40 PM, Feb 19th, 2024
బ్రాహ్మణి.. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: గంజి చిరంజీవి

  • లోకేష్ భార్య బ్రాహ్మణి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు
  • 2014 నుంచి 2019 వరకు మీ మామ చంద్రబాబు నాయుడు చేనేతలకు ఏం చేశాడో చెప్పండి
  • చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేనేత పరిశ్రమంలో నాశనం చేశాడు
  • ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు

వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి కామెంట్స్

12:34 PM, Feb 19th, 2024
చంద్రబాబు ఛాలెంజ్‌.. కేశినేని నాని సూటి ప్రశ్నలు

  • చంద్రబాబు ఛాలెంజ్‌కు.. కేశినేని నాని ప్రతి ఛాలెంజ్
  • చంద్రబాబు స్టేట్మెంట్ చూశా 
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అన్నాడు
  • అభివృద్ధి పై జగన్ వరకు ఎందుకు చంద్రబాబుతో చర్చించేందుకు నేను సిద్దం  
  • తాత్కాలిక సచివాయలం ఒకటి కట్టడం అభివృద్ధా?
  • రాష్ట్రంలో సీఎం జగన్ కట్టిన 10వేలకు పైగా సచివాలయాలు  అభివృద్ధా?
  • చంద్రబాబు కుటుంబం, వారి అనుయాయులు ప్రభుత్వం సంపదను దోచుకోవడం అభివృద్ధా...?
  • మానవ అభివృద్ధి కోసం చదువులు, ఆరోగ్యం,సంక్షేమం ఇలా చేయడం అభివృద్ధా..?
  • చంద్రబాబు 45 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటాడు...అందులో స్వామిదాస్ 35 ఏళ్ల ఇండస్ట్రీ, నాది పదేళ్లు  
  • మేము చెబుతాం ప్రజలకు చంద్రబాబు నీది కాదు అభివృద్ధి.. సీఎం జగన్ దే అభివృద్ధి అని
  • టీడీపీ పార్టీ ఈనాడు పేపర్ చేతుల్లో ఉంది 
  • రామోజీరావు 2 వేల ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తాడు 
  • పేదలను బెదిరించి, ముఖ్యమంత్రు లను లొంగ తీసుకున్న రామోజీరావుకు ఆయన టాయిలెట్ అంత ఉండదు మన అభివృద్ధి
  • 2వేల ఎకరాల కోట అందులోనే ఎయిర్ డ్రోమ్ ,ఫిల్మ్ సిటీ ఇవన్నీ రామోజీరావు అభివృద్ధి
  • చంద్రబాబు చేసేవి మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5,సోషల్ మీడియా, అమెరికాలో ఉండే కుహనా మేధావులకు అభివృద్ధిలా కనిపిస్తాయి
  • తిరువూరు నియోజకవర్గానికి 2,200 కోట్లు సంక్షేమం, అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలకు అందాయి ఇది కాదా చంద్రబాబు అభివృద్ధి

12:02 PM, Feb 19th, 2024
విశాఖలో పవన్ రెండో రోజు పర్యటన

  • సీట్ల సర్దుబాటు పై కసరత్తు చేస్తున్న జనసేనాని
  • అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పవన్
  • నిన్న కొణతాలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్
  • ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం నేతలతో భేటీ
  • పోటీకి సిద్ధపడుతున్న పలువురు జనసేన నేతలు
  • విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ
  • పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు
  • గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్
  • అనకాపల్లి ఎంపీగా పోటీకి నాగబాబు ఆసక్తి.. పోటీకి దిగుతానంటున్న కొణతాల రామకృష్ణ

11:31 AM, Feb 19th, 2024
మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ 

  • మధ్యాహ్నం గంటలకు హాజరుకావాలంటూ స్పీకర్ నోటీసులు
  • నోటీసుల్లో తుది విచారణగా పేర్కొన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం
  • రాకపోతే.. ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ
  • వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన కోటంరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి
  • ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణలకు సైతం నోటీసులు
  • విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే దానిపై సందిగ్థత

11:02 AM, Feb 19th, 2024
బాబును నమ్ముదామా? వద్దా?.. బీజేపీ నిర్ణయంపై ఆసక్తి

  • ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం తేల్చే అవకాశం
  • ఒకట్రెండు రోజుల్లో రానున్న స్పష్టత
  • రాష్ట్ర నాయకత్వానికి క్లారిటీ ఇవ్వనున్న హైకమాండ్
  • చంద్రబాబును నమ్మాలా? వద్దా? అనే అనుమానంలో బీజేపీ
  • పవన్‌ కల్యాణ్‌ కూడా విశ్వసనీయమైన మిత్రుడు కాదన్నయోచనలో కమలనాథులు
  • అయినా సరే, పొత్తు పెట్టుకుందామంటోన్న బాబు, పవన్‌
  • విశాఖ టూర్ తర్వాత ఢిల్లీకి వెళ్లే యోచనలో పవన్ 
  • పిలిస్తే క్షణంలో ఢిల్లీకి వస్తానంటున్న బాబు
  •  ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న బీజేపీ నేతలు
  • ఏపీలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి వివరించిన బీజేపీ నేతలు
  • హైకమాండ్ నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ బీజేపీ నేతలు

10:42 AM, Feb 19th, 2024
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి

  • మహిళకు సాధికారత అందిస్తేనే సమాజం వృద్ధి చెందుతుందని వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నమ్మారు 
  • రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి 
  • జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త 
  • ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు 
  • రామచంద్రగుహ కమిటీ ఓ నివేదిక ఇచ్చినా మహిళల ఇబ్బందులు మారలేదు 
  • 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు 
  • ఇందిరాగాంధీ చేయలేని పనిని జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు 
  • మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది 
  • మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారు 
  • మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు 
  • ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ 
  • మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసిన సీఎం భారతదేశంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే 
  • ప్రజలు మంచి మనసుతో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి 
  • రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది 
  • భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్ 
  • వయసులో చిన్నవాడే అయినా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవి 
  • జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ 
  • అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి 
  • పేదలు.. మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా జగన్ పాటు పడుతున్నారు 
  • జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి 
  • గత ఐదేళ్లలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది 
  • అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు
  • చంద్రబాబు బాధితుల్లో నేను,నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం
  • ఆడవారంటే చంద్రబాబుకి అసహ్యం 
  • జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నాడు 
  • మంచి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాలి
  • చంద్రబాబు ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి 
  • తన కొడుకుని సీఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు 
  • పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది

:::తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు

09:58 AM, Feb 19th, 2024
మైలవరం టీడీపీలో ముసలం

  • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మళ్లీ వేడెక్కిన రాజకీయం
  • వసంత వర్సెస్‌ దేవినేని ఉమాగా మారిన పరిణామాలు
  • టికెట్‌ విషయంలో ఎవరికీ క్లారిటీ ఇవ్వని టీడీపీ అధిష్టానం
  • సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం
  • మైలవరంలో ఎన్నికల ప్రచారానిని ఉమా నిర్ణయం
  • 21 నుంచి అన్నరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ప్లాన్‌

09:28 AM, Feb 19th, 2024
‘నాగబాబుకి ఇవ్వడమేంటండి!’

  • ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన లో రేగుతున్న చిచ్చు
  • నాగబాబు పవన్ పర్యటనకు కొణతాల రామకృష్ణ డుమ్మా
  • నాగబాబు విశాఖ అనకాపల్లి పర్యటనలకు కొణతాల దూరం
  • నిన్న విశాఖ వచ్చిన పవన్ ను కలవని కొణతాల
  • అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇవ్వడం పై కొణతాల అసంతృప్తి
  • జిల్లాలో తనకు తెలియకుండా పర్యటించడంపైన ఆగ్రహం
  • కొణతాల ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్

08:55 AM, Feb 19th, 2024
వన్స్ మోర్ జగన్

  • రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్
  • రాయలసీమ వ్యాప్తంగా తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు
  • వన్స్ మోర్ జగన్ అంటూ నినదించిన వైఎస్సార్ సీపీ క్యాడర్
  • భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు విజయవంతం కావటంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త కూ అండగా ఉంటానన్న సీఎం జగన్
  • ప్రత్యర్థులపై పంచులు గుప్పించిన సీఎం జగన్..  సర్వత్రా చర్చ


08:25 AM, Feb 19th, 2024
పవన్‌.. మళ్లీ భీమవరమేనా?

  • ఉమ్మడి తూర్పు గోదావరిలో నేడు పవన్‌ కల్యాణ్‌ పర్యటన
  • పార్టీ కీలక నేతలతో సమావేశం
  • రేపు భీమవరానికి పవన్‌ 
  • రెండు రోజులపాటు భీమవరంలోనే పవన్‌ మకాం
  • భీమవరం నుంచే పవన్‌ పోటీ చేస్తాడనే ప్రచారం


08:12 AM, Feb 19th, 2024
జగన్‌ పంచులు.. వర్మ మాస్‌ ట్రోలింగ్‌

  • ఏపీ పొత్తు రాజకీయాలపై తనదైన శైలిలో ఆర్జీవీ సెటైర్లు
  • టీ గ్లాస్‌ సింక్‌లో పడేసిన వీడియో పోస్ట్‌ చేసిన వర్మ
  • రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ పంచులు
  • ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. గ్లాస్ సింక్ లో ఉండాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
  • జనసేనపై సీఎం జగన్‌ పంచ్‌ను ఇలా చూపించిన వర్మ

07:43 AM, Feb 19th, 2024
ఫుల్‌ జోష్‌తో వైఎస్సార్‌సీపీ సిద్ధం 

  • భారీ సభలతో దూసుకువెళ్తున్న వైఎస్సార్‌సీపీ
  • చరిత్ర సృష్టించిన నిన్నటి రాప్తాడు సిధ్దం సభ
  • ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో సిద్ధం సభలు పూర్తి
  • త్వరలోనే పల్నాడు జిల్లాలో మరో సిద్ధం సభ ఉండే అవకాశం
  • ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా సాగుతున్న సభలు
  • పార్టీ నేతలు, క్యాడర్ లో ఫుల్ జోష్

07:02 AM, Feb 19th, 2024
మారణాయుధాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

  • పల్నాడు జిల్లా మంచికల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
  • పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు
  • మేకపోతుల ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం
  • ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఫైర్‌

06:58 AM, Feb 19th, 2024
రాప్తాడు సిద్ధం సభపై ఆర్జీవీ ట్వీట్‌

  • సముద్రాన్ని తలపించిన రాప్తాడు సిద్ధం సభ
  • వైఎస్సార్‌సీపీ బహిరంగ సభపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందన
  • సీఎం జగన్‌ సిద్ధం సభను చూసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్‌
  • పది లక్షల మందికిపైగా హాజరై ఉంటారని వర్మ అంచనా
  • దేశంలోనే అతిపెద్ద సభ కాబోలు అంటూ ఆశ్చర్యం

06:41 AM, Feb 19th, 2024
సోషల్‌ మీడియాలోనూ సిద్ధమా?: సీఎం జగన్‌

  • ఎన్నికల వేళ.. కపట వాగ్ధానాలు చేస్తు‍న్న చంద్రబాబు
  • ఎల్లో మీడియా తప్పుడు కథనాలు 
  • అంతటిని ఎండగట్టడానికి సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? అంటూ సీఎం జగన్‌ పిలుపు 
  • సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్ ద్వారా తిప్పికొట్టాలని పార్టీ కేడర్‌ను పిలుపు

06:36 AM, Feb 19th, 2024
పవన్ బుజ్జగింపు పర్వం 

  • మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి పవన్ కల్యాణ్
  • అభ్యర్ధుల ఎంపికపై కొణతాలతో సమావేశమైన పవన్ కల్యాణ్
  • ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కొణతాల నివాసానికి పవన్
  • అనకాపల్లిలో నాగబాబు టూర్ కు దూరంగా ఉన్న కొణతాల
  • నిన్న కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు
  • ఆసక్తిగా మారిన కొణతాల, పవన్ సమావేశం
  • అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ప్రచారం కావడంతో పవన్‌-కొణతాల భేటీకి ప్రాధాన్యత
     

06:30 AM, Feb 19th, 2024
ఎవరు పోటీలో ఉన్నా.. మనకే ప్రజల బ్రహ్మరథం: సీఎం జగన్‌

  • పార్టీ క్యాడర్‌ని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా
  • అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా
  • ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం
  • కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు

whatsapp channel

మరిన్ని వార్తలు