నా నామినేషన్‌ తట్టుకోలేక కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు: కంగనా

29 Mar, 2024 18:42 IST|Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ తమ లోక్‌సభ అభ్యర్థిగా కంగనా రనౌత్‌ను ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఈ బాలీవుడ్‌ నటి పేరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కంగనాపై కాంగ్రెస్‌ మహిళా నేత సుప్రియా శ్రీనాథే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి నటి కౌంటర్‌ ఇవ్వడం, ఈసీ నోటీసులు.. వంటి పరిణామాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా కంగనా మండిలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మండిలో తన నామినేషన్‌ను జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.

బీజేపీ నుంచి నామినేషన్‌ వేసిన తరువాత చాలా సంతోషించినట్లు తెలిపారు. తిరిగి సొంత ప్రదేశానికి రావడాన్ని ఎవరూ సెలబ్రేట్‌ చేసుకోకుండా ఉంటారని అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హిందువల్లో శక్తిని నిర్మూలించడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మండిలో ప్రతి ఏడాది మ‌హాశివ‌రాత్రి నాడు అతిపెద్ద మేళా నిర్వ‌హిస్తార‌ని, అలాంటి ప్రాంత మ‌హిళ‌లపై కాంగ్రెస్ నేత‌లు అమ‌ర్యాద‌క‌రంగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

మండికి రిషి మాండవ్య పేరు పెట్టారని, ఋషి పరాశరుడు తపస్సులో కూర్చున్న రిషి మాండవ్య పేరు పెట్టారని, అంత‌టి ప‌విత్ర ప్ర‌దేశం మండి అని పేర్కొన్నారు. చౌక‌బారు నేత‌ల నుంచి ఇంత‌క‌న్నా మ‌నం ఏం ఆశించ‌గ‌ల‌మ‌ని కంగనా ప్ర‌శ్నించారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers