Chhattisgarh Election Results 2023: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయం

3 Dec, 2023 22:39 IST|Sakshi

Updates..

54 చోట్ల గెలిచిన బీజేపీ

35 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ

54 స్థానాల్లో బీజేపీ ముందంజ

  • 49 చోట్ల గెలిచిన బీజేపీ, మరో 5 చోట్ల ఆధిక్యం
  • 33 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం, 2 చోట్ల ముందంజ
  • ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ

55కు చేరిన బీజేపీ ఆధిక్యం

  • 12 చోట్ల బీజేపీ గెలుపు. మరో 42 స్థానాల్లో ఆధిక్యం.
  • 7 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం. మరో 28 చోట్ల ముందంజ.

ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం ఆధిక్యంలో బీజేపీ
బీజేపీ-53
కాంగ్రెస్‌-36
ఇతరులు-1

►ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సగం మార్కును దాటింది. ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం 50 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 38 స్థానాల్లో కొనసాగుతోంది.

ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
బీజేపీ-46
కాంగ్రెస్‌-40
ఇతరులు-1

►ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ కో-ఇన్‌చార్జ్ నితిన్ నబిన్ అన్నారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఇదీ ప్రజలు గ్రహించారన్నారు. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

►ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. బీజేపీ-39, కాంగ్రెస్‌-35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
బీజేపీ-27
కాంగ్రెస్‌-24
ఇతరులు-2

 

►మొదటి రౌండ్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ 15, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం

►అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో ముందంజ

►పటాన్ నియోజకవర్గంలో సీఎం భూపేష్ బఘేల్ వెనుకంజ

►బీజేపీ మాజీ మంత్రి అమర్ అగర్వాల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శైలేష్ పాండేపై 3000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►పోస్టల్ బ్యాలెట్‌ ఫలితాల్లో కాంగ్రెస్ 45 , బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

►ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ, మా అంచనాల కంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రెండింటిలోనూ మేము అధికారాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని, తెలంగాణలో అధికారం చేపడతామన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్‌ అధికారులు, 416 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి సీఎం భూపేశ్‌ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తదితర ప్రముఖులున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90
మెజారిటీ మార్కు:46

మరిన్ని వార్తలు