'ఇదీ కాంగ్రెస్‌ సంస్కృతి'.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్‌

5 Jun, 2021 19:31 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర విమానయానా శాఖా మంత్రి హర్దీప్ సింగ్‌ పూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత, వ్యాక్సినేషన్ మందకొడిగా సాగడంపై రాహుల్ విమర్శలు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై హర్దీప్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘దేశంలోని చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఎప్పుడు అని రాహుల్ అడుగుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్లను చెత్తబుట్టల్లో పాడేస్తున్నారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి’’ అంటూ హర్దీప్ సింగ్ పూరీ తీవ్రంగా ఆక్షేపించారు.

అంతకముందు పంజాబ్ ప్ర‌భుత్వం అధిక ధ‌ర‌ల‌కు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల‌ను అమ్ముకుంటోంద‌ని హ‌ర్దీప్ ఆరోపించారు. ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు లాభానికి పంజాబ్ ప్ర‌భుత్వం వ్యాక్సిన్ల‌ను విక్ర‌యిస్తోంద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పంజాబ్ ప్ర‌భుత్వం కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ 309కి కొనుగోలు చేసి దాన్ని ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు రూ 1560కి విక్ర‌యిస్తోంద‌ని పూరి ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్ డోసుల‌ను పంజాబ్ స‌ర్కార్ లాభానికి విక్ర‌యించ‌డం అనైతిక‌మ‌న్నారు.
చదవండి: వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భార‌త్ ఎందుకు వ్య‌తిరేకిస్తోంది?

లాక్‌డౌన్‌ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు