కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దు

20 Nov, 2023 05:31 IST|Sakshi
పెగడపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత   

ఎమ్మెల్సీ కవిత ధర్మపురి, పెగడపల్లి, కాటారంలో బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం

ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. ‘తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉన్నదో’గమనించాలని సూచించా రు. ధర్మపురి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆదివారం ఆమె ధర్మపురి, పెగడపల్లి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు గంటల కరెంటు చాలని, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, అదే జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము మరోసారి అధికారంలోకొస్తే అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రస్తుత పథకాలు కొనసాగాలన్నా.. మరిన్ని పథకాలు రావాలన్నా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం ఆమె ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. తర్వాత స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో మహిళలతో మాట్లాడారు. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఆ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. 

దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు.

కాంగ్రెస్‌ అధికారంలో లేదని సాకులు చెబుతూ ఏ పనీ చేయ ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు ఓటు వేయడం వృథా అన్నారు. మంథని అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం ప్రకటించారని, మంథనిని కేసీఆర్‌ దత్తత తీసుకుంటారేమో అనిపిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు