ఒక్కడే.. కానీ రెండు ఓట్లు!

15 Dec, 2023 17:25 IST|Sakshi

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలనేది ఎన్నికల కమిషన్‌ నిబంధన. ఇలా లేకపోతే ‘అక్కడ- ఇక్కడ’ పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు ఏరివేతకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటున్నా సాధారణ పౌరులు నుంచి సెలబ్రెటీల వరకూ ఒక్క చోట కంటే ఎక్కువ చోట్లే ఓటును ఏదొక రకంగా నమోదు చేసుకుంటూనే ఉంటున్నారు.

ఇదంతా ఎందుకంటే ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఏపీలో ఓట్లు నమోదు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు కొణిదల నాగబాబు ‘రెండో ఓటు’ను నమోదు చేసుకోవడానికి అది కూడా ఏపీలో నమోదుకు దరఖాస్తు చేయడంపై ఒకవైపు విస్మయం.. మరొకవైపు విమర్శలు వస్తున్నాయి. 

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌-168లో కొణిదల నాగబాబు(సీరియల్‌ నెంబర్‌-323), కొణిదల పద్మజ(సీరియల్‌నెంబర్‌- 324), సాయి వరుణ్‌ తేజ్‌(సీరియల్‌ నెంబర్‌-325) ఓటు వేశారు.

వీరు తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా, ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఈ విషయం తెలుసుకున్న సాధారణ జనం.. అమ్మ నాగబాబు అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు