బీజేపీ మాదిగ విశ్వరూప సభ.. వారం వ్యవధిలోనే హైదరాబాద్‌కు మరోసారి మోదీ

8 Nov, 2023 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల నేపథ్యంతో.. వారం వ్యవధిలోనే దేశ ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. మంగళవారం(నవంబర్‌ 7)న ఆయన  ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ‌ గర్జన సభకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే..   ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ నగరంలో పర్యటిస్తారని రాష్ట్ర బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ మాదిగ విశ్వరూప సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారని పార్టీ ఆ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. ఈ వేదిక నుంచి ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

షెడ్యూల్‌ ఇలా.. 
శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేటలో ప్రధాని మోదీ దిగుతారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సుమారు గంటపాటు ఈ సభ జరగనుంది. సభ జరిగిన వెంటనే తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.  

మరిన్ని వార్తలు