కేరళలో ఆ రెండు పార్టీల చరిత్ర అవినీతికి మారు పేరు: ప్రధాని మోదీ

17 Jan, 2024 16:47 IST|Sakshi

కొచ్చి: కేరళలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌), యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రెండు​ రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ‘శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌ సమ్మేళనం’లో పాల్గొని ప్రసంగించారు.

కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ పార్టీలు చరిత్ర అవినీతికి మారు పేరు అని ప్రధాని మోదీ మండిపడ్డారు.  ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో​కి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయటంలో బీజేపీకి మాత్రమే ఘనమైన రికార్డు ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు పట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గడిచిన బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. కానీ.. కాంగ్రెస్‌ పార్టీ గత ఐదు దశాబ్దాలుగా కేవలం ‘గరీబీ హఠావో’ నినాదం వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

కేరళలోని బీజేపీ కార్యకర్తలు ఎంత శక్తివంతులో త్రిస్సూర్‌లో ఏర్పాటు చేసిన ‘నారి శక్తి సమ్మేళనం’ కాన్ఫరెన్స్‌ ద్వారా అర్థమైందని మోదీ అన్నారు. అటువంటి వారే బీజేపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని తెలిపారు. దేశంలోనే తక్కువ కాలంలో రికార్డు స్థాయితో అభివృద్ధి చెందుతూ... దేశ భవిష్యత్తు పట్ల సంపూర్ణమైన దార్శనికత ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని మోదీ అభిప్రాయపడ్డారు.

చదవండి:  అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?

>
మరిన్ని వార్తలు