దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా నర్సారెడ్డి?

5 Oct, 2020 02:05 IST|Sakshi

ఏఐసీసీకి టీపీసీసీ ప్రతిపాదన 

ఈ నెల 7వ తేదీన అధికారిక ప్రకటన! 

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిల సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి త్వంపై చర్చల్లో శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటనర్సింహారెడ్డిల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు దామోదర రాజ నర్సింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డి, సురేశ్‌ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌ రెడ్డి, కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, దుబ్బాక సమన్వయకర్త నగేశ్‌ ముదిరాజ్‌ల అభి ప్రాయం తీసుకోగా ఎక్కువ మంది నర్సారెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్టు తెలు స్తోంది. పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం సోమవారం ఉదయం టీపీసీసీ నేతలతో మరోమారు సమావేశం అయిన తర్వాత ఈ ప్రతిపాదనతో ఢిల్లీ వెళ్లనున్నారు.

ఈనెల 7వ తేదీన పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుం దని టీపీసీసీ వర్గాలంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక కోసం 147 మంది ఇన్‌చార్జులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఆదివారం ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు ఏడుగురు ముఖ్యనేతలకు, 140 గ్రామాలకు 140 మంది పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఈ నెల 7వ తేదీ నుంచి నియోజకవర్గంలో ఉండి 
పని చేయాలని ఆయన ఆదేశించారు. నవంబర్‌ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు