BRS: ఆరూరి ఇంటి వద్ద హైడ్రామా.. బీజేపీ నేతలు సీరియస్‌

13 Mar, 2024 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత ఆరూరి రమేష్‌ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్‌ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు. ఇక, పరిణామాలపై బీజేపీ నేత సీతారాం నాయక్‌ స్పందించారు. 

ఈ సందర్భంగా సీతారాం నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆరూరి రమేష్‌ ఇంటి వద్ద చోటుచేసుకున్న పరిణామాలు నాటకీయంగా ఉన్నాయి. నిన్న(మంగళవారం) అమిత్‌ షాను కలిసి బీజేపీలో చేరేందుకు రమేష్‌ రెడీ అయ్యారు. ఈరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీలో జాయిన్‌ అవుతున్నా అని ప్రకటిస్తున్నానని మాకు చెప్పారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లి ప్రవర్తించిన తీరు సరికాదు. రమేష్‌ తన ఇష్టంతో సొంత నిర్ణయం తీసుకుంటే వీరికి వచ్చిన బాధేంటి?.

బీఆర్‌ఎస్‌ నేతలు రమేష్‌ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. గతంలో నా రాజకీయ జీవితం కూడా బీఆర్‌ఎస్‌ నేతలే నాశనం చేశారు. నాకు BRS చేసిన అన్యాయంపై 151 బుక్స్ రాయవచ్చు. దళితులకు వీళ్ళు గతంలో ఏమి చేశారని ఇప్పుడు వచ్చి బీఆర్‌ఎస్‌ వాళ్లు ఎం హామీ ఇస్తారు?. గతంలో ఎప్పుడైనా ఆరూరికి ఎర్రబెల్లి మద్దతుగా ఉన్నాడా?. ఆరూరి జీవితంతో ఎర్రబెల్లి, బీఆర్‌ఎస్‌ నేతలు ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers