తెలంగాణ కొత్త మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు ఇవే?

7 Dec, 2023 15:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నూతన సర్కార్‌ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కింది విధంగా శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. 

  • భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి
  • ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి- హోం మంత్రి
  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్‌ శాఖ మంత్రి
  • డి.శ్రీధర్‌బాబు-ఆర్థికశాఖ మంత్రి 
  • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదలశాఖ మంత్రి 
  • కొండా సురేఖ-మహిళా సంక్షేమశాఖ మంత్రి  
  • దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
  • జూపల్లి కృష్ణారావు- పౌరసరఫరాలశాఖ మంత్రి
  • పొన్నం ప్రభాకర్‌- బీసీ సంక్షేమశాఖ మంత్రి
  • సీతక్క- గిరిజన సంక్షేమశాఖ మంత్రి 
  • తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ మంత్రి 
>
మరిన్ని వార్తలు