నాది మెరిట్‌ కోటా!

2 Dec, 2023 17:13 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్‌ కోటా అని, తనది మెరిట్‌ కోటా అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల  కౌంటింగ్‌కు ఒకరోజు ముందు శనివారం రేవంత్‌ ఇంటి వద్ద ఆయన అభిమానులు రేవంత్‌ సీఎం సీఎం అని నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.   

తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్‌ రాజకీయ పోరాటమంతా కేసీఆర్‌తోనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడైన తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు దాదాపు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.  

అయితే, కాంగ్రెస్‌ పార్టీలోనే కొందరు రేవంత్‌రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బక్క జడ్సన్‌ లాంటి ఎస్సీనేత రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వొద్దు అని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ప్లకార్డులు ప్రదర్శించి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వైఎస్‌ఆర్టీపీ అధినేత వైఎస్‌ షర్మిల కూడా పరోక్షంగా రేవంత్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చారు. పార్టీలో ఆయనకన్నా విశ్వసనీయత కలిగిన నేతలున్నారని మీడియా సమావేశంలోనే డైరెక్టుగా చెప్పారు. 

ఇదీచదవండి..రంగంలోకి డీకే.. స్పెషల్‌ ఫ్లైట్‌లు రెడీ!


 

    

మరిన్ని వార్తలు