వ్యక్తిగతంగా తిట్టమని చెప్పడం తప్పు: విజయసాయిరెడ్డి

12 Jan, 2024 15:58 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి సమస్య లేదని.. పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో నాలుగో జాబితా ఉంటుందన్నారు.

‘‘చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్‌ చేస్తున్నది ఆధారాలతో  సహ ఎలక్షన్ కమిషన్‌కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం. కానీ.. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే  పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంది. తిట్టమని చెప్పడం తప్పు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ విజయసాయి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: మాకు అంత కర్మ పట్టలేదు: మంత్రి రోజా

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega