సామాజిక జైత్ర యాత్ర.. జై జగన్ నినాదాలతో హోరెత్తిన పామర్రు

9 Nov, 2023 20:54 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం ప్రియా టవర్స్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, ప్రజలు  తరలివచ్చారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, కొలుసు పార్ధసారధి, ముస్తఫా, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. సాయంత్రం పామర్రు సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.

బహిరంగ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలన్నారు. అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారన్నారు. ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వ్యక్తి సీఎం జగన్‌. కోట్లు వెచ్చించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారు’’ అని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.

2014లో చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి పోటీ చేశారు. 600కు పైగా హామీలిచ్చి మోసం చేశాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు.. ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. పేదలకు ఆరోగ్యం,ఇంగ్లీషు మీడియం చదువు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి  సీఎం జగన్‌. చంద్రబాబును బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలెవరూ నమ్మొద్దు. సీఎం జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. బీసి, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాలి. సీఎంకు మనం అండగా నిలిచి.. మళ్లీ గెలిపించుకోవాలి’ అని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు.

ఏపీలో జైత్ర యాత్ర: ఎంపీ మోపిదేవి
సామాజిక సాధికారత గతంలో మాటల్లోనే విన్నాం.. కానీ సామాజిక సాధికారత అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎంకు కృతజ్ఞతగా రాష్ట్రంలో జైత్ర యాత్ర సాగుతోంది. సీఎం కుర్చీలో దగ్గర్నుంచి మన కోసమే ఆలోచన చేసిన వ్యక్తి జగన్‌. సీఎం పేరు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. బీసీ కులాల నుంచి నలుగురిని రాజ్యసభకు పంపించారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ప్రతీ ఒక్కరికీ సాధికారత దక్కింది’’ అని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు.

మీది షణ్ముఖ వ్యూహమైతే.. మాది జగనన్న వ్యూహం: మంత్రి జోగి రమేష్‌
దేశంలో సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక సీఎం మన జగనన్న. సీఎం జగన్‌ను దించడం కోసం ఒకడు షణ్ముఖ వ్యూహం అంటాడు. ఛీటర్స్ అంతా చేరి వ్యూహం పన్నుతున్నారు. సీఎం జగన్‌కు వ్యూహాలతో పనిలేదు. జగనన్నకు ఊపిరిగా మేం ఉన్నాం.15 రోజులకోసారి టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో మీటింగ్‌లు పెట్టి ఏం సాధిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, కాపు సోదరుల దెబ్బకు మీరు తుడిచి పెట్టుకుపోతారు. జగనన్న కటవుట్ వేస్తేనే పామర్రు పోటెత్తింది. జగనన్న వస్తే ఆ సునామీలో మీరంతా కొట్టుకుపోతారు. మీది షణ్ముఖ వ్యూహమైతే.. మాది జగనన్న వ్యూహం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవుల్లో అవకాశం కల్పించిన ఒకే ఒక్కడు జగన్‌. ఏపీకి 25 ఏళ్లు జగనన్నే సీఎంగా ఉంటాడు.. ఇది చరిత్ర

నా ప్రాణం ఉన్నంత వరకూ సీఎం జగన్‌ వెంటే.. ఎమ్మెల్యే కైలే
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ సీఎం జగన్‌ వెంటే ఉంటానని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యుల వల్లే నేను ఈ స్థాయికి ఎదిగా.. ఎప్పటికీ పామర్రు ప్రజలకు రుణపడి ఉంటా. ఎస్సీలు నీట్‌గా ఉండరన్న వ్యక్తి చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. .కానీ జగన్ మాత్రమే నా ఎస్సీ, బీసీ,మైనార్టీ అంటూ మనల్ని అక్కున చేర్చుకున్నారు.. ఊరికి ఇద్దరు బాగుపడితే చాలనుకుంటాడు చంద్రబాబు..ఊరంతా బాగుపడాలని కోరుకునేది వైఎస్‌ జగన్‌.

ప్రత్యర్ధులకు కైలే మాస్ వార్నింగ్..
పామర్రు ప్రజల కోసం నేను ఎన్ని మెట్లు అయినా దిగుతా. కొందరు అనవసరంగా ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు. వంగవీటి మోహనరంగా హత్య జరిగినపుడు ఎవరు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నారో నాకు తెలుసు. మీ ఇంట్లో పిల్లోడు ఏడ్చినా కైలే కారణమని చెప్పడం మానుకోండి. నేను జీతానికి పనిచేయడం లేదు. పామర్రు ప్రజలకు సేవ చేసేందుకే పనిచేస్తున్నా

మరిన్ని వార్తలు