'సన్‌ ఆఫ్‌ ఢిల్లీ'.. అతడి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా: ఏబీడీ

21 Mar, 2024 13:19 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. రోడ్డు ప్రమాదం కారణంగా గత 14 నెలలకు ఆటకు దూరంగా ఉన్న రిషబ్‌.. తిరిగి ఐపీఎల్‌-2024తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌లో పాల్గోనేందుకు పంత్‌కు ఏన్సీఏ కూడా క్లియరెన్స్‌ సర్టిఫికేట్ ఇచ్చేసింది.

దీంతో అతడి రీ ఎంట్రీకి కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆస​క్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను 'సన్‌ ఆఫ్‌ డిల్లీ'గా ఏబీడీ అభివర్ణించాడు. 

"సన్‌ ఆఫ్‌ డిల్లీ(పంత్‌) పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అతడు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. పంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.

పంత్‌ జెర్సీ నెం 17. నా జెర్సీ నెంబర్‌ కూడా పదిహేడే. రిషబ్‌ ఆట అంటే నాకు ఏంతో ఇష్టం. అతడికి ఐపీఎల్‌లో సెంచరీ కూడా ఉంది. పంత్‌ రీ ఎంట్రీలో కూడా సత్తాచాటాలని కోరుకుంటున్నానని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో మిస్టర్‌ 360 పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో పంత్‌ నాయకత్వంలోనే ఢిల్లీ బరిలోకి దిగనుంది.

గతేడాది అతడి గైర్హజరీలో ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ వ్యవహరించాడు. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.
 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers