Ab De villiers: డివిలియర్స్‌ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ

12 Oct, 2021 14:23 IST|Sakshi
Courtesy: IPL Twitter

AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్‌ 2021లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత సెకండ్‌ఫేజ్‌లో ఆర్‌సీబీ బ్యాటింగ్‌ విభాగంలో పడిక్కల్‌, కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, కేఎస్‌ భరత్‌ కీలకపాత్ర పోషించారు. అయితే సీనియర్‌ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌కు మాత్రం యూఏఈ గడ్డ ఏమాత్రం కలిసిరాలేదు. ప్లేఆఫ్స్‌తో కలిపి డివిలియర్స్‌ 8 మ్యాచ్‌ల్లో 17.66 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 0,12,11,4, 23, 19, 26,11 ఇవి డివిలియర్స్‌ యూఏఈ గడ్డపై నమోదు చేసిన స్కోర్లు. ఇందులో ఒక గోల్డెన్‌ డక్‌ ఉండడం విశేషం. 

చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్‌ బ్యాటింగ్‌లో సునీల్‌ నరైన్‌ 26 పరుగులతో గేమ్‌ చేంజర్‌ కాగా.. గిల్‌ 29, వెంకటేశ్‌ అయ్యర్‌ 26, నితీష్‌ రాణా 23 పరుగులు చేశారు. అంతకముందు ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్‌ నరైన్‌(4/21) బౌలింగ్‌లో మెరవడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్‌ 21 పరుగులు చేశాడు.

చదవండి: Virat Kohli: ఆర్‌సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ

మరిన్ని వార్తలు