ILT20 2024: ఇది కదా క్రీడా స్పూర్తి అంటే? రనౌట్‌ అయినా కూడా వెనుక్కి! వీడియో

29 Jan, 2024 16:40 IST|Sakshi

ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా డెసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్‌ కోలిన్‌ మున్రో మాత్రం అభిమానులు మనసును గెలుచకున్నాడు. ఈ మ్యాచ్‌లో  క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. రనౌట్‌ రూపంలో వికెట్‌ పొందే అవకాశం ఉన్నప్పటకీ మున్రో మాత్రం తన నిర్ణయంతో అందరని ఆశ్చర్యపరిచాడు. 

ఏం జరిగిందంటే?
షార్జా వారియర్స్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ వేసిన షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో జో డెన్లీ స్ట్రైట్‌గా షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మార్టిన్ గప్టిల్‌కు బలంగా తాకి బౌలర్‌ చేతికి వెళ్లింది. బంతి తగిలిన వెంటనే గప్టిల్‌ నొప్పితో కిందపడిపోయాడు. అప్పటికే గప్టిల్‌ క్రీజు బయట ఉండడం గమనించిన షాదాబ్‌ ఖాన్‌.. స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌కు అప్పీల్‌ చేశాడు.

అంపైర్‌ కూడా ఔట్‌ ఇచ్చేశాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాన్రో షాదాబ్‌తో మాట్లాడి రనౌట్‌ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ప్టిల్‌కు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించే అవకాశాన్ని మున్రో కల్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మున్రోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గప్టిల్‌, మున్రో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైంది.
చదవండి: అతి జాగ్రత్తే కొంపముంచింది.. రోహిత్‌ కూడా సచిన్‌లా ఆడాలి: మాజీ క్రికెటర్‌

whatsapp channel

మరిన్ని వార్తలు