హర్భజన్‌ విజ్ఞప్తి.. ‘మాస్కు పోడు’

26 Aug, 2020 14:58 IST|Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను పలు సూచనలు చేశాడు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బహిరంగ దేశాల్లో తిరగొద్దని చెన్నై అభిమానులను కోరాడు. అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశాడు. దీనికోసం అతను తమిళంలోనే మాట్లాడటం విశేషం. ఈమేరకు భజ్జీ ట్వీట్‌ చేశాడు. కాగా, 2018లో చైన్నై జట్టులో చేరిన హర్భజన్‌ మెరుగైన ప్రదర్శనతో ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

సీఎస్‌కే తరపును ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 23 వికెట్లు తీశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్‌ స్పిన్నర్‌ 7.05 సగటుతో 150 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలాఉండగా.. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక యూఏఈ క్రికెట్‌ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చెన్నై జట్టులో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన హర్భజన్‌కు ఐపీఎల్‌ 2020 మరింతగా కలిసివచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిమానులు సంబరపడుతున్నారు.
(చదవండి: ఐపీఎల్‌లో డోపింగ్‌ పరీక్షలు)

మరిన్ని వార్తలు