చరిత్ర సృస్టించిన జస్ప్రీత్‌ బుమ్రా.. ఎవరికీ సాధ్యంకాని ఘనతలు సొంతం

7 Feb, 2024 15:57 IST|Sakshi

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో సహచరుడు అశ్విన్‌ను మూడో స్థానానికి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. విశాఖ టెస్ట్‌లో సంచలన ప్రదర్శనల నేపథ్యంలో బుమ్రాకు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు ముందు బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు.

టెస్ట్‌ల్లో నంబర్‌ వన్‌ స్థానం​ దక్కించుకోవడం ద్వారా బుమ్రా పలు రికార్డులు నెలకొల్పాడు. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా (బుమ్రాకు ముందు భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, బిషన్‌ సింగ్‌ బేడీ టెస్ట్‌ల్లో నంబర్‌ వన్‌ స్థానం దక్కించుకున్నారు) నిలిచాడు. 

అలాగే విరాట్‌ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌గా నిలిచిన రెండో ఆసియా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా (హేడెన్‌, పాంటింగ్‌, కోహ్లి తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. గతంలో బుమ్రా వేర్వేరు సందర్భాల్లో వన్డే, టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు బుమ్రా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో టాప్‌ ర్యాంక్‌ సాధించిన తొలి బౌలర్‌గా, తొలి పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ వరుస ఇలా ఉంది.

  1. బుమ్రా
  2. రబాడ
  3. అశ్విన్‌
  4. కమిన్స్‌
  5. హాజిల్‌వుడ్‌
  6. ప్రభాత్‌ జయసూర్య
  7. జేమ్స్‌ఆండర్సన్‌
  8. నాథన్‌ లయోన్‌
  9. రవి జడేజా
  10. ఓలీ రాబిన్సన్‌

టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి (ఏడో ర్యాంక్‌) ఒక్కడే టాప్‌ 10లో ఉన్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కివీస్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ రేటింగ్‌ పాయింట్స్‌ను మరింత పెంచుకుని అగ్రపీఠాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టాప్‌ టెన్‌ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ వరుస ఇలా ఉంది.

  1. కేన్‌ విలియమ్సన్‌
  2. స్టీవ్‌ స్మిత్‌
  3. జో రూట్‌
  4. డారిల్‌ మిచెల్‌
  5. బాబర్‌ ఆజమ్‌
  6. ఉస్మాన్‌ ఖ్వాజా
  7. విరాట్‌ కోహ్లి
  8. హ్యారీ బ్రూక్‌
  9. దిముత్‌ కరుణరత్నే
  10. మార్నస్‌ లబూషేన్‌

జట్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే..
భారత్‌, ఆస్ట్రేలియా జట్లు చెరి 117 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, జింబాబ్వే వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. అక్షర్‌ పటేల్‌ ఐదో ప్లేస్‌కు ఎగబాకాడు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega