ఆ జట్టు ప్లే ఆఫ్‌ చేరడం ఖాయం: ఆకాశ్‌ చోప్రా

3 Apr, 2021 14:16 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.  ''ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కాబట్టి.. ఈ ఏడాది ప్లేఆఫ్‌కి అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ.. పట్టికలో 1, 2 లేదా 3 స్థానాల్లో ఆ జట్టు నిలిచి ప్లేఆఫ్‌కి వెళ్తుందని నేను అనుకోవడం లేదు. నా అంచనా ప్రకారం నెం.4లో నిలవడం ద్వారా ప్లేఆఫ్‌లో అడుగు పెట్టొచ్చు. కోల్‌కతాకి బలమైన బ్యాటింగ్‌ లైనప్ ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసే బౌలర్లు లేరు. ముఖ్యంగా ఆల్‌రౌండర్లు ఉన్న జట్టుగా పేరున్న కేకేఆర్‌కు అదే బలం.. బలహీనంగా మారనుంది. లోకీ ఫెర్గూసన్, పాట్ కమిన్స్ ఆరంభ, మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయగలరు. కానీ అదే సమయంలో యువ పేసర్లు కమలేష్ నాగర్‌కోటి, ప్రసిధ్‌ కృష్ణ గత ఏడాది తేలిపోయారు.'' అని చెప్పుకొచ్చాడు.

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తన తొలి మ్యాచ్‌ని ఏప్రిల్ 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా ఆడనుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం ద్వారా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
చదవండి: 
ఐపీఎల్‌ 2021: డేవిడ్‌ వార్నర్‌ను ఆటపట్టించిన రోహిత్‌

'ఈసారి సీఎస్‌కే ఆఖరి స్థానానికే పరిమితం'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు