కేఎల్‌ రాహుల్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ విషెస్‌.. సునీల్‌ శెట్టి స్పందన

18 Apr, 2021 21:50 IST|Sakshi

ముంబై: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 29వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌కు పుట్టినరోజు అభినందనలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. అయితే అతనికి శుభాకాంక్షలు చెప్పిన అందరిలోకెల్లా తన గర్లఫ్రెండ్‌ అతియా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాహుల్‌కు విషెస్ చెబుతూ.. అత‌నితో దిగిన ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. '' గ్రేట్‌ఫుల్ ఫ‌ర్ యు, హ్యాపీ బ‌ర్త్ డే'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫోటోలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కడా బయటపెట్టకపోవడం విశేషం. దీనిపై అతియా తండ్రి, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా స్పందించాడు.  హ్యాపీ బర్త్‌డే రాహుల్‌.. అంటూ ఓ బ్లాక్ క‌ల‌ర్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ''మై క్యూటీస్ అంటూ క్రికెట‌ర్'' హార్దిక్ పాండ్యా కూడా అతియా పోస్ట్‌పై కామెంట్ చేశాడు.

కాగా కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బిజీగా ఉ‍న్న సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్‌ అర్థ శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. మయాంక్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్‌ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా 69 పరుగులతో రాణించడంతో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
చదవండి: ప్లీజ్‌.. డివిలియర్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ ఆడుతాడా చెప్పండి

A post shared by Athiya Shetty (@athiyashetty)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు