IPL 2021: ఐపీఎల్‌ రేటింగ్స్‌.. బీసీసీఐకి బ్యాడ్‌న్యూస్‌

12 Oct, 2021 15:14 IST|Sakshi
Courtesy: IPL Twitter

IPL 2021 Viewership Ratings.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆఖరి దశకు చేరుకుంది. క్వాలిఫయర్‌ 2తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రమే మిగిలిఉంది. అయితే క్యాష్‌రిచ్‌ లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌లో ప్రతీసారి వీక్షకుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతూ వస్తుంది. అయితే ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో మాత్రం రేటింగ్స్‌ పడిపోయినట్లు రిపోర్ట్స్‌లో తేలింది. రిపోర్ట్స్‌ ప్రకారం ఐపీఎల్‌ రేటింగ్స్‌ దాదాపు 15-20 శాతం పడిపోయినట్లు తెలిసింది. కాగా  ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేస్తుంది. స్టార్‌స్పోర్ట్స్‌ ఇంగ్లీష్‌, హిందీ చానెళ్లతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో మ్యాచ్‌లు ప్రసారమవుతున్నాయి.

చదవండి: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఎవరి మ్యాచ్‌లు ఎక్కువగా చూశారంటే..

అయితే ప్రకటనదారులతో రేటింగ్‌లు తగ్గడం లేదని.. వీక్షకుల సంఖ్య పడిపోవడం వల్లే ఇలా జరిగిందని ఎంటర్‌టైన్‌మెంట్‌(ఈటీ)లో తేలింది. రేటింగ్‌ల పతనానికి సంబంధించిన ఖాతాలపై ప్రకటనదారులు పరిహారం కోసం వెతికే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇలా ఐపీఎల్‌  రేటింగ్స్‌ పడిపోవడం బీసీసీఐకి  అంత సానుకూలాంశం కాదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రకటనదారుల నుంచి వేలకోట్లు నష్టపోయే అవకాశం ఉంది. కాగా అక్టోబర్ చివరి నాటికి కొత్త మీడియా హక్కుల టెండర్‌ను విడుదల చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. రాబోయే వారంలో రేటింగ్‌లు పెరగకపోతే మాత్రం బీసీసీఐకి భారీ నష్టాలు చూసే అవకాశం ఉంటుంది.

చదవండి: Ab De villiers: డివిలియర్స్‌ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ

మరిన్ని వార్తలు