‘కోహ్లి, ఏబీలకు నా ప్లాన్‌ అదే’

1 May, 2021 14:58 IST|Sakshi

అహ్మదాబాద్‌: హర్‌ప్రీత్‌ బ్రార్‌.. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.  ఆర్సీబీతో ఆడిన మ్యాచ్‌ అతనికి ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మొదటిది. గత సీజన్‌ వరకూ హర్‌ప్రీత్‌ బ్రార్‌ ఆడిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు మూడే. 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి సీజన్‌కు ఒక మ్యాచ్‌ చొప్పున మాత్రమే హర్‌ప్రీత్‌కు అవకాశం దక్కింది. అతని ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ తీసిన వికెట్లు మూడు. అది కూడా ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనే రావడం విశేషం. 

ఫింగర్‌ స్పిన్నర్‌ అయిన హర్‌ప్రీత్‌ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌లో ఎదుర్కోవడం కష్టంగా అనిపించే అతన్ని తుది జట్టులోకి తీసుకున్నట్లు పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ తెలిపాడు. అతని నుంచి మేనేజ్‌మెంట్‌ ఏదైతే ఆశించిందో అది చేసి చూపించాడు బ్రార్‌.  ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని బౌల్డ్‌ చేసిన విధానం కానీ, ఆపై వెంటనే మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్‌ చేయడం చూస్తే ‘వాటే ఏ బౌలింగ్‌’ అనిపించింది. అటు తర్వాత ఏబీ డివిలియర్స్‌కు ఆఫ్‌ స్టంప్‌ ఊరించే బంతిని వేసి మరీ ఔట్‌ చేశాడు బ్రార్‌. అయితే కోహ్లి, ఏబీలకు బౌలింగ్‌ చేసే క్రమంలో ప్రత్యేకమైన వ్యూహం అనుసరించినట్లు బ్రార్‌ తెలిపాడు. 

ప్రత్యేకంగా షార్ట్‌ లెంగ్త్‌ బాల్స్‌ను లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో వేస్తే కోహ్లి తప్పకుండా భారీ హిట్‌లు చేయడానికి వస్తాడనే తెలిసే అతనికి ఆ తరహా బంతులు వేశానన్నాడు. ఒకవేళ తాను వేసే బంతులకు ఫోర్‌ వచ్చినా ఫర్వాలేదనే భావించే కచ్చితమైన  లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బాల్స్‌ను వేశానన్నాడు. అది కూడా షార్ట్‌ లెంగ్త్‌లో వేస్తే కోహ్లి కచ్చితంగా చార్జ్‌ తీసుకుని హిట్‌ చేయడానికి యత్నిస్తాడని అదే వ్యూహం వర్కౌట్‌ అయ్యిందన్నాడు.  

ఇక ఏబీ విషయానికొస్తే అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతుల్ని అతని స్లాట్‌లో వేస్తే హిట్‌ చేసే అవకాశం ఉందని అనుకున్నానన్నాడు. ఆ సమయంలో  స్లిప్‌ క్యాచ్‌ కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఆ ప్లేస్‌లో ఫీల్డర్‌ను పెట్టానన్నాడు. ఇక కవర్స్‌ కూడా కవర్‌ చేయడంతో ఏబీ తొందరగానే తనకు చిక్కాడన్నాడు. తాను డాట్‌ బాల్స్‌ను సాధ్యమైనంతవరకూ వేయాలనుకున్నానని, అవే  వికెట్లు తెచ్చాయన్నాడు. తాను బిందాస్‌(కేర్‌ ఫ్రీ) క్రికెట్‌ ఆడాలనుకున్నానని, ఎక్కువ ఒత్తిడి తీసుకోవాలని అనుకోలేదన్నాడు.  అదే ఫలితాన్ని ఇచ్చిందని ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ తెలిపాడు. 

ఇక్కడ చదవండి: అదీ కెప్టెన్‌ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
ఔర్‌ ఏక్‌ దాల్‌ చహల్‌.. దెబ్బకు వికెట్‌ పడింది!

మరిన్ని వార్తలు