అలా అయితే ధోని సేనదే టైటిల్‌: బ్రియన్‌ లారా

20 Apr, 2021 11:23 IST|Sakshi
సీఎస్‌కే ఆటగాళ్లు(Photo Courtesy: CSK Twitter)

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మెరుగ్గా ఉందని, ఇలాంటి సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా అభిప్రాయపడ్డాడు. జట్టులోని బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫాంలో ఉన్నందువల్ల ధోని బ్యాటింగ్‌ సేవలకు విరామం ఇవ్వాలని సూచించాడు. ఐపీఎల్‌-2021లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొయిన్‌ అలీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు తోడు, జడేజా, డుప్లెసిస్‌, రాయుడు, బ్రావో రాణించడంతో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది. 

ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారా స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... ‘‘ధోని బ్యాటింగ్‌ సేవల గురించి మరీ ఎక్కువగా ఆశించడం సరికాదు. వికెట్‌ కీపర్‌గా తను స్టంపింగ్స్‌ చేస్తున్నాడు. క్యాచ్‌లు పడుతున్నాడు. తన శైలే వేరు అన్న సంగతి అందరికీ తెలుసు. నిజానికి ఇప్పుడు సీఎఎస్‌కే బ్యాటింగ్‌ ఆర్డర్‌ చాలా బాగుంది. కాబట్టి ధోని విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. తను ఫాంలో ఉండాలని అందరూ కోరుకోవడం సహజమే. తను ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ధోని(ఫొటో: బీసీసీఐ), బ్రియన్‌ లారా

అయితే, ఇప్పుడు జట్టులో సామ్‌ కరన్‌(బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌) వంటి ఎంతో మంది మెరుగైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందుకే ధోని రెస్ట్‌ తీసుకున్నా ఫరవాలేదు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక ప్రస్తుతం సీఎస్‌కే జట్టు పరిపూర్ణంగా కనిపిస్తోందన్న లారా.. ‘‘చెన్నైకి ధోని వంటి స్పూర్తిమంతమైన నాయకుడు ఉన్నాడు. ఒకవేళ తను గనుక అందరు కెప్టెన్సీపై మరింత దృష్టిసారించి, ప్రతీ ఆటగాడి సేవలను పూర్తిగా వినియోగించుకుని, ఇదే స్థాయి ప్రదర్శన ఇవ్వగలితే విజయం వారిదే’’ అంటూ ధోని సేన నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా ఇ‍ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో గెలుపొందిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది.

చదవండి: IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్‌...
ఎప్పుడూ నా ఫోకస్‌ అదే: ధోని

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు