ముంబై ఇండియన్స్‌ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్‌..

7 Apr, 2021 22:04 IST|Sakshi

లండన్: ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌(ఐపీఎల్‌)‌ 14వ ఎడిషన్‌‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్‌ విజేత ఎవరనే అంశంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ట్విటర్ వేదికగా తన అంచనాలను పంచుకున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే టైటిల్ గెలిచే జట్టేదో చెప్పేశాడు. వాన్‌ అంచనాల ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్సే ఈసారి కూడా టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందని జోస్యం చెప్పాడు. ఏదో అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు వట్టి చేతులతో వెళ్లదన్నాడు. ముంబై కానీ పక్షంలో టైటిల్‌ గెలిచే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఉందన్నాడు.

ఐపీఎల్‌ విజేతపై అంచనాలను ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే, వాన్‌ ప్రిడిక్షన్‌పై  మిగతా ఐపీఎల్‌ జట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ నువ్వే డిసైడ్‌ చేస్తే, ఇన్ని జట్లు ఆడటం ఎందుకని  చురకలంటిస్తున్నారు. ఏప్రిల్‌ 9న ప్రారంభంకానున్న ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా కోల్‌కతాతో ఆడనుంది. ముంబై, హైదరాబాద్‌ జట్లు ఫేస్‌ టు ఫేస్‌ మ్యాచ్‌లను ఏప్రిల్‌ 17న, మే 4న ఆడనున్నాయి.
చదవండి: క్వారంటైన్‌ పూర్తయిన ఆనందంలో గేల్‌ ఏం చేశాడో తెలుసా..
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు